Friday, December 27, 2024

రష్యా క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌కు ఇక అణుధార్మిక ముప్పు

- Advertisement -
- Advertisement -

Ukraine is now a nuclear threat due to Russian missile attacks

కీవ్ : రష్యా ఉక్రెయిన్ యుద్ధం చినికి చినికి చివరకు అణు పెను ముప్పు వైపు దారితీస్తోంది. క్రైమియా బ్రిడ్జి పేల్చివేత ఘటనతో ప్రతీకారంతో రగిలిపోతున్న రష్యా ఉక్రెయిన్‌పై భీకర క్షిపణులతో దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో జపోరిజజియా అణుకేంద్రం ఎనర్గో ఆటమ్ అత్యంత శక్తివంతం అయిన క్షిపణులతో రష్యా జరిపిన దాడి విలయానికి దారితీసింది. ఈ ప్లాంట్‌కు పూర్తి స్థాయిలో బయటి నుంచి అందే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఐదు రోజులలో రెండుసార్లు ఈ విధంగా కరెంటు లేకపోవడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అణుధార్మికత ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. అణుకేంద్రంలోని కీలక అత్యంత సునిశిత భద్రతా యంత్రాలు, వ్యవస్థలకు నిరంతర విద్యుత్ అవసరం అని, లేకపోతే రేడియేషన్ ప్రభావం బయటి ప్రాంతాలకు చేరుకుంటుందని ఉక్రెయిన్ న్యూక్లియర్ వ్యవహారాల ఉన్నతాధికారి తెలిపారు. రష్యా ఆధీనంలోకి వచ్చినట్లే వచ్చి చేజారిన జపోరిజజియా ప్రాంతం తిరిగి కైవసం చేసుకునేందుకు రష్యా భీకరంగా స్పందిస్తోంది.

రష్యా యత్నాలను ఢీకొనేందుకు మరో వైపు యూరప్ దేశాలు కొన్ని నేరుగా ఉక్రెయిన్‌కు ధీటైన ఆయుధ వ్యవస్థను సమకూర్చేందుకు సిద్ధం అవుతున్నాయి. రష్యా దాడులతో ఈ ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోయి బ్లాకౌట్ పరిస్థితి ఏర్పడింది. ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్‌ను మిస్సైల్ ఢీకొనడంతో ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. పునరుద్ధరణ పనులకు అడ్డంకిగా నిరంతరాయంగా రష్యా దాడులు సాగుతున్నాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకాలతో అణుకేంద్రం పరిస్థితి గందరగోళంలో పడింది. వరుసగా ఈ ప్లాంట్‌లోని వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో రేడియేషన్ ప్రభావం ఏర్పడుతోందని హెచ్చరికలు వెలువడ్డాయి. ఇంతకు ముందు ఇక్కడ ఆరు రియాక్టర్లు ఆగిపొయ్యాయి. యూరప్‌లోని అతి పెద్ద ఈ న్యూక్లియర్ ప్లాంట్‌లో యంత్రాలు వేడెక్కకుండా అందులోని అణుపదార్థాలు కరిగిపోయి రేడియేషన్ జరగకుండా చేయాలంటే విద్యుత్ సరఫరా అవసరం అని నిపుణులు చెపుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో దీనిని పనిచేయించేందుకు డీజిల్ ట్యాంకులు తరలివస్తున్నాయి. అయితే రష్యా దళాలు ఈ ట్యాంకుల కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News