Tuesday, February 11, 2025

ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావచ్చు: ట్రంప్

- Advertisement -
- Advertisement -

రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావచ్చు… కాకపోవచ్చు అని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ వారు (రష్యా, ఉక్రెయిన్‌లను ఉద్దేశిస్తూ) ఒప్పందం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు.. ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో 500 మిలియన్ డాలర్ల డీల్‌తోపాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్‌ను త్వరలో కీవ్‌కు పంపనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చేవారం న్యూనిచ్‌లో జెలెన్‌స్కీతో భేటీ అవుతారని అక్కడి అధికారి తెలిపారు. దాదాపు మూడేళ్లుగా ఉక్రెయిన్ష్య్రాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.

ఈ క్రమంలో అధికారం లోకి వచ్చిన ట్రంప్ తాను యుద్ధాన్ని ఆపేస్తానని పలుమార్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. రష్యా చర్చలకు వచ్చేందుకు నిరాకరిస్తే ఆంక్షలు విధిస్తానంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల పుతిన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని ట్రంప్ స్వయంగా తెలిపారు. యుద్ధం కారణంగా అమాయక ప్రజలు చనిపోవడం ఆపాలని పుతిన్ కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా చేస్తున్న సాయానికి 500 మిలియన్ డాలర్ల డీల్‌ను ప్రతిపాదించగా దీనికి వారు కూడా అంగీకరించారన్నారు. ఈ డీల్‌లో భాగంగా కీవ్ అధీనం లోని అరుదై న ఖనిజాలను అమెరికాకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు గ్యాస్‌ను కూడా సరఫరా చేయాల్సి వస్తుంది. తమకు ఖనిజాలు లభిస్తే ఆ దేశానికి అవసరమైన వాటిని అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News