- Advertisement -
మాస్కో : బుధవారం ఉక్రెయిన్ ప్రయోగించిన ఓ క్షిపణి రష్యా లోపలి సైనిక శిబిరంపై పడింది. సరిహద్దుల నుంచి ప్రయోగించిన ఈ మిస్సైల్ బెల్గోరాడ్ ఆయుధ గిడ్డంగిని తాకిందని వార్తా సంస్థలు తెలిపాయి. ఓ వైపు రష్యా బలగాలు ఉక్రెయిన్ మారుమూల ప్రాంతాలలోకి చొచ్చుకుపోతున్నాయి. ప్రధాన నగరాల కైవసానికి వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఇందుకు ప్రతిగా ఇప్పుడు రష్యా లోపలి ఆయుధ గిడ్డంగిని టార్గెట్‌గా చేసుకుని ఉక్రెయిన్ దాడికి దిగింది. ఆయుధాల గిడ్డంగిపై దాడితో ఉన్నట్లుండి చాలా సేపటి వరకూ పక్కనున్న గ్రామాల వరకూ పేలుళ్ల చప్పుళ్లు భారీగా విన్పించినట్లు డైలీ మెయిల్ పత్రిక తెలిపింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఈ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ ఈ విషయాన్ని తెలియచేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వార్త వెలువరించింది.
- Advertisement -