- Advertisement -
ఆయుధాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ఉక్రెయిన్ !
కీవ్: రష్యాతో జరుగుతున్న పోరులో రోజుకు కనీసం 200 మంది ఉక్రెయిన్ సైనికులు మృత్యువాత పడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధి మిఖాయిల్ పొడొల్యాక్ పేర్కొన్నారు. పశ్చిమ దేశాల నుంచి తమకు వందలకొద్దీ శతఘ్నుల అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదన్నారు. డాన్ బాస్ కోసం రష్యా చేస్తున్న దాడుల్లో ఉక్రెయిన్ దళాలు చిక్కుకున్నాయన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ కు ఆయుధాల అవసంర తీవ్రంగా ఉందని మిఖాయిల్ పొడొల్యాక్ పేర్కొన్నారు. 150 నుంచి 300 దాకా రాకెట్ లాంచర్లు అవసరం ఉందన్నారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి అప్పగిస్తేనే చర్చలకు సిద్ధమవుతామని మిఖాయిల్ తెలిపారు.
- Advertisement -