Thursday, December 26, 2024

కూలిపోయిన ఉక్రెయిన్ విమానం

- Advertisement -
- Advertisement -
Ukraine plane crash kills 14
దానిలో ప్రయాణించిన 14 మంది మృతి

కీవ్: రష్యా బలగాలు దాడిచేస్తున్న తరుణంలో ఉక్రెయిన్‌కు చెందిన విమానం గురువారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వద్ద కూలిపోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అత్యవసర సేవలు తెలిపినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్థ తెలిపింది. ఆ విమానంలో ప్రయాణించిన దాదాపు 14 మంది మృతి. ఇదిలావుండగా ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడి మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 మంది చనిపోయారు. దీనికి ముందు లుహాన్స్ ప్రాంతంలో రష్యా విమానాన్ని కూల్చేసినట్లు ఉక్రెయిన్ సేన పేర్కొంది. ఉక్రెయిన్ విమాన స్థావరాల్లో మిలిటరీ మౌలికవసతులను తొలగించినట్లు రష్యా ధృవీకరించింది. తద్వారా ఉక్రెయిన్ డెఫెన్స్‌లను అణచివేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇదిలావుండగా తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు గ్రామాలను స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తన టెలివిజన్ ప్రసంగంలో ఉక్రెయిన్ సైనికులు తమ ఆయుధాలను పడేసి ఇంటికి తిరిగి వెళతారన్నారు. రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య ఘర్షణ తప్పదని కూడా ఆయన స్పష్టం చేశారు. రష్యా చేపట్టిన ప్రత్యేక మిలిటరీ చర్య ‘ఉక్రెయిన్‌ను నిసైనికీకరణ, డీనాజిఫికేషన్ చేయలన్నదే లక్షం” అని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News