Monday, December 23, 2024

రష్యాతో బెలారస్‌లో శాంతి చర్చలకు ఉక్రెయిన్ తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

Ukraine rejects Russian offer of talks in Belarus

కీవ్ : రష్యాతో బెలారస్‌లో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడుల్లో కొన్ని బెలారస్ గడ్డపై నుంచి జరుగుతున్నాయన్నారు. ఉక్రెయిన్‌పై దూకుడు ప్రదర్శించని ప్రాంతంలో మాత్రమే చర్చలు జరపడానికి తాము వస్తామని చెప్పారు. ఇప్పటికే బెలారస్ లోని గోమెల్ నగరానికి చేరుకున్న రష్యా ప్రతినిధి బృందం ఉక్రెయిన్ ప్రతినిధి బృందం రాక కోసం ఎదురు చూస్తోంది. ఉక్రెయిన్‌పై క్షిపణుల ప్రయోగానికి వేదికలు కానటువంటి దేశాల్లో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని జెలెన్‌స్కీ తెలిపారు.

వార్సా, ఇస్తాంబుల్, బకులలో శాంతి చర్చల వేదికను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ఉక్రెయిన్‌లో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యన్ దళాలు బాంబులు కురిపించాయని, శనివారం రాత్రి అత్యంత కిరాతకంగా మిలిటరీ రక్షణ లేని, ప్రజలు నివసించే చోట దాడులు చేశారని చెప్పారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కమాండర్ ఇన్‌చీఫ్ వాలెరీ జలుజ్నీ ఆదివారం ఇచ్చిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో కీవ్ నగరం పైకి బెలారస్ నుంచి ప్రయోగించిన క్షిపణిని ఉక్రెయిన్ వాయుసేన కూల్చేసిందని తెలియజేసింది. బెలారస్, రష్యా మరో యుద్ద నేరానికి పాల్పడ్డాయని ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News