Monday, December 23, 2024

తెగిపోయిన చెర్నోబిల్ విద్యుత్ లైన్లను పునరుద్ధరిస్తున్న ఉక్రెయిన్

- Advertisement -
- Advertisement -

Ukraine restoring severed Chernobyl power lines

బెర్లిన్: చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తెగిపోయిన విదుత్ లైన్లను రిపేరు చేయడాన్ని తమ సాంకేతిక నిపుణులు ప్రారంభించినట్లు ఉక్రెయిన్ శుక్రవారం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు తెలియజేసింది. 1986లో అణు విపత్తుకు కారణమైన చెర్నోబిల్‌కు రష్యా దాడుల కారణంగా విద్యుత్‌గ్రిడ్‌తో సంబంధాలు తెగిపోయాయని, ఎమర్జెన్సీ జనరేటర్లు బ్యాకప్ పవర్‌ను అందజేస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు గత బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వర్కర్లు తెగిపోయిన లైన్లలో ఒక భాగాన్ని మరమ్మతు చేశారని, అయితే ఇప్పటికీ మిగతా భాగాలు దెబ్బతిన్నట్లుగానే కనబడుతోందని శుక్రవారం ఉక్రెయిన్ నూక్లియర్ రెగ్యులేటర్ తెలియజేసింది. ప్లాంట్ వెలుపల పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ మరమ్మతు ప్రయత్నాలు కొనసాగుతాయని ఆ సంస్థ తెలిపింది. జనరేటర్లకు అదనపు ఇంధనాన్ని సరఫరా చేయడం జరిగిందని, అయితే వీలయినంత త్వరలో విద్యుత్ లైన్లను పునరుద్ధరించడం ముఖ్యమని కూడా ఆ సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News