Sunday, December 22, 2024

ఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్ధుల నిరసన

- Advertisement -
- Advertisement -

Ukraine-returned students protest in Delhi

న్యూఢిల్లీ : అర్ధాంతరంగా నిలిచిపోయిన వైద్య విద్యను పూర్తి చేసేందుకు దేశం లోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతీయ యూనివర్శిటీలు, విద్యాసంస్థల్లో వైద్య విద్యను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఉక్రెయిన్‌లో అనివార్య పరిస్థితుల కారణంగా చదువులు మధ్యలోనే వదిలేసి వచ్చిన తమ పిల్లల భవిష్యత్ సంక్షోభంలో పడిందని, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఈ నిరసన కార్యక్రమంలో 500 మంది ఉక్రెయిన్ ఎంబీబీఎస్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ (పీఏయూఎంఎస్)లో సభ్యత్వం ఉన్న 18 రాష్ట్రాలకు చెందిన వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిల్లలను ప్రాణాలను రక్షించి ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చిన విధంగానే పిల్లల భవిష్యత్‌ను కూడా కాపాడాలని తల్లిదండ్రులు విన్నవించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News