Wednesday, January 22, 2025

సేఫ్ కారిడార్ ఏర్పాటు ప్రకటనలు

- Advertisement -
- Advertisement -
Ukraine Russia agree to create safe corridors
కీవ్ చుట్టూ భీకర పోరు ప్రకంపనలు
తాజా శాటిలైట్ ఫోటోలతో స్పష్టం
చిక్కుపడ్డ పౌరులకు ప్రాణసంకటం

లండన్:  కాల్పుల విరమణకు దిగుతున్నామని రష్యా అధికారిక ప్రకటన చేసినా ఇప్పటికీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాలలో భీకర స్థాయిలో కాల్పులు సాగుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తాజా ఉపగ్రహ ఛాయాచిత్రాలతో స్పష్టం అయింది. మాక్సర్ టెక్నాలజీస్ వారు ఈ చిత్రాలను వెలువరించారు. ఇందులో అత్యంత కీలకమైన అంటోనోవ్ ఎయిర్‌పోర్టు వద్ద నెలకొని ఉన్న పరిస్థితి స్పష్టం అయింది. ఈ వ్యూహాత్మక ఎయిర్‌పోర్టు చుట్టూ భారీ స్థాయిలో సైనిక కదలిక ఉంది. కాల్పులు సాగుతున్నాయని తేలింది. ప్రైవేటు అమెరికా సాంకేతిక సంస్థ వెలువరించిన అత్యంత సాంద్రత గల ఇమేజ్‌లు ఇప్పుడు కలవరం కల్గిస్తున్నాయి. సైనిక కార్యకలాపాలు తీవ్రస్థాయిలో సాగుతున్న విషయం ఈ సాక్షాలతో స్పష్టం అయింది. రష్యాపై తీవ్రస్థాయిలో ఆర్థిక ఆంక్షలు వెలువడుతున్నాయి. అయితే ఎటువంటి రాజీలేకుండా రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. దీని ప్రభావం కీవ్ ఇతర ప్రాంతాల పౌరులపై పెను పిడుగుపాటు అయింది.

రష్యా ఆధీనంలోకి ఇక్కడి కీలకమైన అంటోనోవ్ విమానాశ్రయం వచ్చింది. ఇక్కడ పలు సాయుధ శకటాలు కలియతిరుగుతున్నాయి. సైనికులు విన్యాసాలు సాగిస్తున్నాయి. పంట పొలాలు ఇక్కడి ఇర్పిన్ నది వద్ద పౌరులు వెళ్లుతున్న దశలోనే సైనిక సంచారం సాగుతున్న వైనం ఇప్పటి ఇమేజ్‌లతో వెలుగులోకి వచ్చింది. పలు చోట్ల బ్రిడ్జిలపై బాంబులు కురిపించిన ఆనవాళ్లు శాటిలైట్ చిత్రాలతో వెల్లడైంది. రష్యా ట్యాంకులు ఉక్రెయిన్ ప్రధాన ప్రాంతాలలోకి చొచ్చుకుని రాకుండా చేసేందుకు పలు ప్రాంతాలలో ఉక్రెయిన్ సైన్యం ప్రధాన రాదార్లును, వంతెనలను పేల్చివేసింది. అనేక చోట్ల పౌర నివాసిత ప్రాంతాలలో భయానక స్థితి ఉన్నట్లు ఇప్పటి శాటిలైట్ ఇమేజ్‌లు తెలియచేశాయి. పలు ప్రాంతాల నుంచి పౌరులను వేరే చోట్లకు తరలిస్తున్నారు. ఇర్పిన్‌లోని సురక్షిత మార్గాలను కూడా వదలకుండా , జనం తరలింపు ఏర్పాట్ల విషయంలో పాటించాల్సిన అంతర్జాతీయ సూత్రాలను కూడా పట్టించుకోకుండా రష్యా బల ప్రయోగానికి దిగుతోందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ ఆరోపించింది. దీనితో అమానుష పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితిని తెలియచేసే శాటిలైట్ ఛాయాచిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అక్కడి హృదయ విదారక దృశ్యాలు ప్రజలకు ఆందోళన కల్గిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News