Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు … 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్ లోని 11 ప్రాంతాల్లో రాత్రికి రాత్రి రష్యా దాడులకు పాల్పడింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరి కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. తమ భూభాగాల నుంచి రష్యా బలగాలను తరిమికొట్టడానికి ఉక్రెయిన్ భీకర పోరాటం సాగిస్తోంది. బఖ్‌మట్ నగరం లో నియుయోర్క్ నివాస ప్రాంతాలపై శుక్రవారం రాత్రి రష్యా దాడులకు కొత్తగా పెళ్లయిన దంపతులతో సహా మొత్తం నలుగురు మృతి చెందారని తూర్పు డొనెట్స్ రీజియన్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ వెల్లడించింది. మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. డొనెట్స్ రీజియన్ కొటియాంటినివ్‌కా నగరంలో శుక్రవారం రాత్రి రష్యా దాడులకు ఇద్దరు పౌరులు మృతి చెందారు.

Also Read: ఆ టమాటా రైతు ఇప్పుడు కోటీశ్వరుడు

మరో పౌరుడు గాయపడ్డాడు. 20 ప్రైవేట్ ఇళ్లు, కార్లు, గ్యాస్ పైపులైన్ ధ్వంసం అయ్యాయి. రష్యా సరిహద్దుకు 100 కిమీ దూరంలో గల కెమిహివ్ ఉత్తర ప్రాంతం నగరానికి సమీపాన ఇద్దరు చనిపోగా , స్థానిక సాంస్కృతిక కేంద్రం, అపార్టుమెంట్ ప్రాంతాలు రష్యా క్షిపణులకు ధ్వంసం అయ్యాయని ప్రాంతీయ సైనిక కార్యాలయం ప్రకటించింది. జోరిజ్‌జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సమీపాన ఉన్న నగరంలో బాంబు దాడులకు ముగ్గురు పౌరులు గాయపడ్డారు. రష్యా మొదట్లోనే స్వాధీనం చేసుకున్న ఈ న్యూక్లియర్ ప్లాంటును ఉపయోగించుకుని సమీపాన ఉన్న ఉక్రెయిన్ భూభాగంపై తరచుగా రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అయితే 14 రష్యా డ్రోన్లను తాము కూల్చి వేశామని ఉక్రెయిన్ వైమానిక దళం శనివారం ప్రకటించింది. ఇందులో ఐదు ఇరాన్ తయారీ డ్రోన్లు ఉన్నాయని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News