- Advertisement -
ఉక్రెయిన్‌లో విషాదఘట్టాలు
కీవ్: ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలలో ఆటవికపు యుద్ధంతో మానవీయ విషాదం చోటుచేసుకొంటోంది. ఆహారం, నీరు, వైద్య పరికరాలు, ఔషధాలకు కటకట ఏర్పడింది. రేవు పట్టణం అయిన మేరియూపోల్ సహా పలు నగరాలలో హృదయవిదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. యుద్ధం మొదలై ఇప్పటికే 13రోజులు అయింది. తొలి పదిరోజులలోనే ఉక్రెయిన్ నుంచి దాదాపుగా 15 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడారని ఐరాస శరణార్థుల హై కమిషనర్ కార్యాలయం తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి చూస్తే ఈ విధంగా ఇంత పెద్ద సంఖ్యలో శరణార్థుల సమస్య ఏర్పడటం ఇదే తొలిసారి అని ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న పౌరులు పోలెండ్, హంగరీ, రొమేనియా, స్లోవేకియాలకు పారిపొయ్యారు. వచ్చే కొద్ది నెలల్లో శరణార్థుల సంఖ్య 40 లక్షలకు చేరుకుంటుందని ఐరాస తెలిపింది.
- Advertisement -