స్లోవియాన్‌స్క్: ఉక్రెయిన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న రష్యా నగరం బెల్‌గోరోడ్‌లో నేడు భారీ పేలుళ్లు సంభవించాయి. ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పేలుడుకు మొత్తం 11 అ పార్ట్‌మెంట్ భవనాలు, 39 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిని ఆ ప్రాంత గవర్నర్ గ్లాడికోవ్ ధ్రువీకరించారు. ఈ పేలుళ్ల కారణంగా వైమానిక రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దాడిపై ఉక్రెయిన్ మాత్రం స్పందించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయినప్పటి నుంచి రష్యాలోని ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి పేలుళ్లు సంభవిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన ‘షామన్’ రహస్య బెటాలియన్ రష్యాలోకి చొరబడి కీలక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని ‘ది టైమ్స్’ పత్రిక ఇటీవల రాసింది. కానీ నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇటీవల రష్యాలో చోటు చేసుకొన్న అనుమానస్పద ఘటనల వెనుక ఈ బెటాలియన్ హస్తం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉక్రెయిన్ దళాలు ఇంత సాహసం చేస్తాయని రష్యా అధికారులు కూడా నమ్మడం లేదు. దాడుల గురించి చెప్పేప్పుడు వారు కేవలం గుర్తు తెలియని గ్రూపు అని మాత్రమే పేర్కొంటున్నారు.