Monday, December 23, 2024

రష్యా బోట్లను ముంచేసిన ఉక్రెయిన్

- Advertisement -
- Advertisement -

Ukraine sinks Russian boats

కీవ్ : తమ సేనలు రెండు రష్యా గస్తీ నౌకలను నల్లసముద్రం వద్ద ముంచేశాయని ఉక్రెయిన్ సోమవారం తెలిపింది. ఇక్కడి స్నేక్‌ల్యాండ్ తీరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోనే చాలా రోజుల కిందట ఉక్రెయిన్ సేనలు లొంగిపోవాలని రష్యా సేనలు చేసిన డిమాండ్ పనిచేయలేదు. ఇప్పుడు ఏకంగా రష్యా బోట్ల పతనం జరిగింది. అత్యంత కీలకమైన బ్లాక్‌సీ ఐలాండ్స్‌పై ఆధిపత్యానికి రష్యా యత్నిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ పలు రష్యా గస్తీ నౌకలు తిరుగుతున్నాయి. వీటిలో రెండింటిని తాము ధ్వంసం చేశామని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ సామాజిక మాధ్యమంలో తెలిపింది. ఈ రెండు చిన్నపాటి సైనిక నౌకలు . ఉక్రెయిన్ సేనల దాడితో వీటిలో నుంచి మంటలు పొగలు వెలువడుతూ ఇవి సముద్రపు నీట మునిగిన వైనం తెలిపే వీడియో దృశ్యాలను ప్రకటనతో పాటు జతపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News