కీవ్ (ఉక్రెయిన్) రష్యా నుంచి దాడులు పెరగవచ్చన్న హెచ్చరికలతో ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్టు ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ బుధవారం ప్రకటించింది. ఈ ఆదేశం రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల రీజియన్లు డొనెట్సెక్, లుహాన్‌స్క్ తప్ప ఉక్రెయిన్ పరిధి లోని డోనెస్క్, లుహాస్క్, సహా అన్ని టెర్రిటరీలకు వర్తిస్తుందని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీలైతే మరో 30 రోజులకు ఎమెర్జెన్సీ పెరగవచ్చని పేర్కొన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని అన్ని దౌత్యకార్యాలయాలను, అంతర్జాతీయ కార్యాలయాలను మూసివేశారు. ఇక విమానాల సర్వీసులు కూడా రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాలో ఉన్న తమ దేశస్థులను వెనక్కి వచ్చేయాలని ఉక్రెయిన్ ఇప్పటికే కోరింది. ప్రకటించిన ఎమర్జెన్సీ చర్యలను పార్లమెంట్ సూత్రప్రాయంగా అంగీకరించవలసి ఉందని, ఈమేరకు ఉక్రెయిన్ పార్లమెంట్‌కు తాను నివేదిక సమర్పిస్తానని సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఒలెక్సియ్ డానిలోవ్ చెప్పారు. ప్రతివాహనాన్ని తనిఖీ చేయడంతోపాటు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.