- Advertisement -
హిరోషిమా(జపాన్): భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జి7 సమ్మిట్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వలోడిమిర్ జెలెంస్కీతో చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేశాక వారిద్దరు ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. మోడీ జపాన్‌లో ప్రధాని ఫుమియో కిషిదను కలుసుకున్నారు. మహాత్మాగాంధీ బస్ట్ సైజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జి7 గ్రూపు నాయకులతో కూడా కలిశారు.
గ్రూప్ ఆఫ్ సెవెన్(జి7) అనేది ప్రముఖ పారిశ్రామిక దేశాల అనధికారిక సమూహం. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకె, యూఎస్ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుండగా, ఈ జి7 దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతును కొనసాగిస్తున్నాయి. కాగా ఈ సమావేశంలో జెలెన్సీ ఇంటర్నెట్ ద్వారా పాల్గొనబోతున్నారు. ఇంకా అప్‌డేట్స్ రావలసి ఉంది.
- Advertisement -