Sunday, December 22, 2024

రష్యాపై ఉక్రెయిన్ డర్టీబాంబు ప్రయోగం?

- Advertisement -
- Advertisement -

Ukraine's dirty bomb test on Russia?

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో మాస్కో నుంచి షోయిగ్యూ

మాస్కో / న్యూఢిల్లీ : ఇప్పుడు తమపై ఉక్రెయిన్ అత్యంత కీలకమైన ప్రమాదకరమైన ఉగ్రవాద చర్యల డర్టీబాంబుల ప్రయోగానికి దిగుతోందని రష్యా ఆరోపించింది. బుధవారం ఉదయం రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్యూ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ భయానకమైన జీవ రసాయనిక ఆయుధాల సమ్మేళనం అయిన డర్టీబాంబుల తయారీ పూర్తి చేసుకుని వాటిని వాడుతోందని సెర్గీ ఆరోపించారు. ఇది డర్టీబాంబు దశ అయిందని వ్యాఖ్యానించారు. భారత రక్షణ మంత్రి , ఇతర కీలక దేశాల రక్షణ మంత్రులతో కూడా రష్యా మంత్రి మాట్లాడారు. నాటో దేశాలు తమపై అణ్వాయుధాల ప్రయోగం ఆరోపణలకు దిగుతున్నాయని, అయితే డర్టీబాంబు ప్రయోగం కప్పిపుచ్చుకునేందుకు తమపై లేనిపోని అసత్యాలకు దిగుతున్నారని చైనా విదేశాంగ మంత్రికి కూడా రష్యా మంత్రి తెలిపారు. ప్రత్యేకించి భారతదేశ రక్షణ మంత్రికి ఫోన్ చేసి ఎక్కువ సేపు మాట్లాడిన సెర్గీ డర్టీబాంబు వాడకం అత్యంత ప్రమాదకరమని,ఇది మానవాళికి ముప్పు తెచ్చిపెడుతుందని ఆరోపించారు.

అయితే ఇది అసత్య ఆరోపణ అని ఇటువంటివి ప్రమాదకర వార్తలు అని ఉక్రెయిన్ అధికారికంగా ఖండించింది. యుద్ధ రంగంలో తన అతిక్రమణలను దాచిపెట్టేందుకు రష్యా ఇటువంటి ఆరోపణలకు దిగిందని ఉక్రెయిన్ విమర్శించింది. అణుధార్మికత, జీవరసాయనిక ప్రభావిత, రసాయన ఆయుధాల మిళితమైన అత్యంత శక్తివంతమైన బాంబులను సాధారణ బాంబుల శ్రేణులలో మిళితం చేసి వాడటాన్ని డర్టీ బాంబు అటాక్ అంటారు. ఇటువంటి బాంబుల పాటవం అతి కొద్ది దేశాలకు ఉంది. రష్యా రక్షణ మంత్రితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటి యుద్ధం తీవ్రత, ఇది ప్రమాదకరమైన దారి పడుతున్న వైనం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పక్షం కూడా మానవాళికి ముప్పు తెచ్చిపెట్టే ఆయుధాల ప్రయోగానికి దిగరాదని, ఇంతకు ముందటి చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఏ యుద్ధ పక్షం కూడా అణ్వాయుధ స్థితికి పరిస్థితిని దిగజార్చరాదని సూచించారు. అణ్వాయుధాలు కానీ రసాయనిక జీవరసాయనిక ఆయుధాలు కానీ విలయాన్ని సృష్టిస్తాయని హెచ్చరించారు. ముందు ఉభయపక్షాలు ఇప్పటి ఘర్షణల నివారణకు చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంప్రదింపులు, దౌత్యనీతిని ప్రదర్శించాలని కోరారు. అయితే డర్టీబాంబుల ప్రయోగానికి ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిందని తమకు ఇంటలిజెన్స్ సమాచారం అందిందని మాస్కో వర్గాలు రాజ్‌నాథ్‌కు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News