Monday, December 23, 2024

సీవీరోడోనెట్స్క్ నుండి ఉక్రెయిన్ తిరోగమనం

- Advertisement -
- Advertisement -
Ukraine retreat
ఈయూ,  ఉక్రెయిన్ కు  అభ్యర్థి హోదాను మంజూరు చేసింది.
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు గ్రామాలను రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్నదని, కీలకమైన రహదారిపై నియంత్రణ కోసం ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ తెలిపింది.

ఖార్కీవ్:  వారాల ఎడతెగని పోరాటం తరువాత, రష్యా దళాలు  చుట్టుముట్టుతుండడంతో  ఉక్రేనియన్ దళాలు సీవీరోడోనెట్స్క్ నుండి వెనక్కి తగ్గుతాయని ప్రాంతీయ గవర్నర్ శుక్రవారం తెలిపారని రాయిటర్స్ నివేదించింది. ఈ చర్య ఉక్రెనియన్ దళాలకు గణనీయమైన ఎదురుదెబ్బ. నగరం శివార్లలో  ఉన్న ఒక భారీ రసాయన కర్మాగారానికి తిరోగమించడానికి  ముందు ఉక్రెయిన్ దళాలు రష్యన్ సైనికులతో  ఇంటింటి పోరాటం(హౌస్ టు హౌస్ బ్యాటిల్) చేశాయి. లుహాన్స్క్ ప్రాంతం యొక్క పరిపాలనా కేంద్రమైన సీవీరోడోనెట్స్క్ నగరం ఎడతెగని రష్యా బాంబు దాడులను ఎదుర్కొంది. లుహాన్స్క్ గవర్నర్ సెర్హి హైదై మాట్లాడుతూ, నష్టాన్ని నివారించడానికి ఉక్రేనియన్ దళాలు సీవీరోడోనెట్స్క్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలిపారు.  రష్యన్లు జోలోట్ , తోష్కివ్కా నుండి లైసిచాన్స్క్ వైపు  ముందుకు సాగుతున్నారని హైదై చెప్పారు.  రష్యన్ నిఘా విభాగాలు నగర అంచులలో దాడులు నిర్వహించాయని, అయితే ఉక్రెయిన్ రక్షులు తరిమికొట్టారని తెలిపారు.

రష్యన్ సైన్యం లుహాన్స్క్ ప్రావిన్స్‌లో 95 శాతం ,  పొరుగున ఉన్న డొనెట్స్క్ ప్రావిన్స్‌లో దాదాపు సగం నియంత్రణలోకి తీసుకుంది. ఆ రెండు ప్రాంతాలు కలిసి డోన్‌బాస్‌ అంత ఉంటాయి. రష్యా వైమానిక దాడిలో లైసిచాన్స్‌క్‌కు వెళ్లే హైవేపై ఉన్న వంతెన తీవ్రంగా దెబ్బతింది మరియు ట్రక్కులకు నిరుపయోగంగా మారిందని గవర్నర్ సెర్హి హైదై తెలిపారు.

రష్యా నుంచి గ్యాస్ దిగుమతిని తగ్గించుకోనున్న ఈయూ

యుద్ధానికి ముందు రష్యా నుండి 40 శాతం గ్యాస్ పొందిన యూరొపియన్ యూనియన్ ఈ  సంవత్సరం చివరి నాటికి దిగుమతుల్లో  మూడింట రెండు వంతుల వరకు తగ్గించాలని,  2027 నాటికి రష్యా నుంచి పూర్తిగా దిగుమతులను ఆపేయాలని నిర్ణయించింది. యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్న రష్యా నుంచి సహజ వాయువు పొందడంలో యూరొపియన్ యూనియన్ నాయకులకు చమటలు పడుతున్నాయి. వచ్చే శీతాకాం నాటికి ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చని వారు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News