Monday, December 23, 2024

రష్యా ఉక్రెయిన్‌ల డ్రోన్‌ల పోరు

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడులలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. తమ భూభాగంపై పెద్ద ఎత్తున ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు దిగిందని పేర్కొంటూ, ఇందుకు ప్రతిగా రష్యా కీవ్‌పై దాడులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఉక్రెయిన్ నుంచి 18 నెలలుగా దాడులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ తొలిసారిగా రష్యా పశ్చిమ ప్రాంతం పిస్కోవ్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దెబ్బతీసింది. ఈస్టోనియా, లట్వియా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనతో అక్కడ భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని అక్కడి గవర్నర్ కార్యాలయం, స్థానిక మీడియా తెలిపింది. కాగా పలు ప్రాంతాలలో డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. ప్రత్యేకించి మాస్కో చుట్టుపక్కలనే కేంద్రీకృతం చేసుకుని సాగించిన ఈ డ్రోన్ దాడులు క్రెమ్లిన్‌కు వణుకు పుట్టించాయి.

కాగా కొన్ని ప్రాంతాలలో ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా వెంటనే రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజదాని కీవ్‌ను లక్షంగా ఎంచుకుని భవనాలపై బాంబులు కురిపించాయి. దీనితో కుప్పకూలిన భవనాల కింద పలువురు చిక్కుపడ్డారు. ఓ చోట ఇద్దరి భౌతికకాయాలను గుర్తించారు. మంగళవారం అర్థరాత్రి నుంచే పరస్పర దాడులు జరిగాయి. రష్యా కూడా డ్రోన్ దాడులు సాగించినట్లు వెల్లడైంది. కీవ్‌లో అత్యధిక సంఖ్యలో జనం మృతి చెందినట్లు ఆందోళన చెందుతున్నారు. కాగా తాము డ్రోన్లతో చివరికి మాస్కో వరకూ తమ ప్రభావం చూపినట్లు , ఇక ముందు కూడా రష్యా లోతట్టు ప్రాంతాలలో తమ పలు స్థాయిల్లో దాడులు కొనసాగించనున్నట్లు ఉక్రెయిన్ సైనిక ప్రతినిధి ఒక్కరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News