Wednesday, January 22, 2025

భారత్‌కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి?

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిట్రో కులేబా త్వరలో భారతదేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో ఆయన పర్యటన ఉంటుందని, ఇప్పటికే సంబంధిత విషయం ఖరారు అయిందని అధికారులు సోమవారం తెలిపారు. త్వరలోనే స్విట్జర్లాండ్‌లో జరిగే శాంతి సదస్సుకు భారతదేశం మద్దతును కోరేందుకు కులేబా ఇక్కడికి వస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో రష్యా దాడుల , దీనితో తలెత్తుతున్న దుష్ఫలితాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఇతర సీనియర్ అధికారులతో ఆయన చర్చిస్తారని భావిస్తున్నారు. పర్యటన పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News