Friday, December 27, 2024

కారు ప్రమాదంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి గాయాలు

- Advertisement -
- Advertisement -

Ukrainian President Zelensky injured in car accident

కీవ్ : రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకున్న ఇజియం నగరాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సందర్శించి తిరిగి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు, భద్రతా సిబ్బంది వాహనాలను ఓ ప్యాసింజర్ కారు ఢీకొంది. ఈ ఘటనలో జెలెన్‌స్కీ స్వల్పంగా గాయపడ్డారు. “ అధ్యక్షుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తీవ్రమైన గాయాలేమీ కాలేదు” అని అధ్యక్ష ప్రతినిధి సెర్గీ నైకిపోరోవ్ పేర్కొన్నారు..ఈ ప్రమాదానికి కారణమైన ప్యాసింజర్ కారులోని వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News