Monday, December 23, 2024

మరో రష్యా ఇంధన నౌకపై ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ల దాడి

- Advertisement -
- Advertisement -

కీవ్ : నల్లసముద్రంలో క్రిమియాకు సమీపాన కెర్చ్ జలసంధిలో రష్యా ఇంధన నౌకపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడులు సాగించాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఇంధన నౌక వాటర్ పైపు లైన్‌కు సమీపా ఇంజిన్ రూమ్‌కు రంధ్రం పడిందని రష్యా అధికారులు వెల్లడించారు. నౌకలోని 11 మంది సిబ్బందిలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని , పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. రష్యా సైనిక దళాల కోసం ఈ నౌక ఇంధనాన్ని తీసుకెళ్తోంది. దాడి కారణంగా రష్యా, క్రిమియాను కలిపే కెర్చ్ వంతెన పై రాకపోకలకు , జలరవాణాకు 19 కిలో మీటర్ల పొడవునా అంతరాయం ఏర్పడింది.

దాదాపు 450 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ఓ సముద్రడ్రోన్‌ను ఈ దాడికి ఉపయోగించినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడిపై ఉక్రెయిన్ భద్రతాదళాల నిర్వాహకులు వాసిల్ మాల్ యుక్ మాట్లాడుతూ ఉక్రెయిన్ ప్రాదేశిక జలాల్లోనే ఈ తరహా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాని, అవి పూర్తిగా చట్టబద్ధమైనవని వివరించారు. దెబ్బతిన్న ఇంధన నౌకను తరలించడానికి టగ్ బోట్స్‌ను రంగం లోకి దించారు. ఈ నౌక ఇప్పటికే అమెరికా అంక్షల జాబితాలో ఉంది. శుక్రవారం రాత్రి సముద్ర డ్రోన్లతో దాడి చేయడం ఒకే రోజు డ్రోన్లతో జరిగిన రెండో దాడి అవుతుంది.

అంతకు ముందు ఉక్రెయిన్ సమద్ర డ్రోన్లతో చేసిన దాడిలో రష్యా వాణిజ్య పోర్ట నోవోరోసిస్క్‌లో యుద్ధనౌక ఒలెనోగోర్సీ గోర్నాక్ తీవ్రంగా దెబ్బతింది. రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్ నౌకాశ్రయం తరువాత రెండో అతిపెద్ద వాణిజ్య రేవు నొవోరోసిస్క్. ఉక్రెయిన్ష్య్రా యుద్ధం మొదలైన తరువాత రష్యా వాణిజ్య రేవును ఉక్రెయిన్ లక్షం గా చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ రేవులో నేవీ స్థావరం, నౌకా నిర్మాణ యార్డులు, చమురు నింపుకునే టెర్మినల్ ఉన్నాయి. ఎగుమతులకు ఇదో కీలకమైన రేవు. తూర్పు క్రిమియాకు 110 కిమీ దూరంలో ఈ నొవోరోసిస్క్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News