రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ ఉక్కు మహిళ
తమ దేశంపై దండయాత్ర చేస్తున్న రష్యా సైనికులను ఉక్రెయిన్‌కు చెందిన ఓ మహిళ నిలదీసిన తీరు అందరిలో ఇప్పుడు స్ఫూర్తి నింపుతోంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆమెపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజధాని కీవ్‌కు సమీపంలోని ఓడరేవు నగరమైన హెనిచెస్క్‌లోని వీధుల్లోకి వస్తున్న రష్యా బలగాలకు ఒక ఉక్రెయిన్ మహిళ ఎదురు నిలబడి ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా మా దేశంలో ఏం చేస్తున్నారు..అసలు మీకు ఇక్కడేం పని అని నిలదీసింది. తుపాకులు, పెద్ద మెషిన్ గన్లు పట్టుకున్న ఆ సైనికులు నివ్వెరపోయాలా ఆక్రోషించింది. దీంతో వారు ఆ మహిళతో ఇక్కడ ఏం జరగటం లేదంటూ.. ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ఏ మాత్రం ఖాతరు చేయకుండా మీకు ఇక్కడేం పని అంటూ గర్జించింది. దెబ్బకు ఆ రష్యా సైన్యం తాము ఇక్కడ సైనిక కసరత్తులు చేస్తున్నాం దయచేసి మీరు వెళ్లండి అని వాళ్లు సున్నితంగా చెబుతున్న ఆమె లక్ష్యపెట్టలేదు. పైగా ఈ భూమి పై మీకు ఏం దొరకదు. కనీసం ఈ గింజలైన తీసుకుని జేబులో పెట్టుకోండి. మీరంతా ఇక్కడ పడుకున్నప్పుడు కనీసం ఆ పొద్దుతిరుగుడు పువ్వులు అయిన పెరుగుతాయని వ్యంగ్యంగా చెప్పి నిష్క్రమించింది. పొద్దు తిరుగుడు పువ్వు ఉక్రెయిన్ జాతీయ పుష్పం కావడం విశేషం.
Woman in Henichesk confronts Russian military. “Why the fuck did you come here ? No one wants you!” 🤣#Russia #Ukraine #Putin pic.twitter.com/wTz9D9U6jQ
— Intel Rogue (@IntelRogue) February 24, 2022