Thursday, January 23, 2025

పేలుళ్ల దారులలోదూసుకువెళ్లే సివంగి

- Advertisement -
- Advertisement -

Ukrainian women train in Kosovo to clear landmines

ఉక్రెయిన్ ఆంగ్ల టీచరమ్మ మించుకోవా
మందుపాతరల ఏరివేతలో ఆరితేరిన నారీ
యుద్ధ విధ్వంసాల నివారణలో కీలకం

పెజా : చుట్టూ ముప్పు పొంచి ఉన్న చోటు మనిషికి కొత్త విద్యలను నేర్పుతుంది. కల్లోల కడలిగా మారిన ఉక్రెయిన్‌లో ఇప్పుడు 20 ఏళ్ల ఇంగ్లీషు టీచరు మందుపాతరలు కనుగొని, వాటిని ఏరివేసే పనిలో ఆరితేరింది. నడుస్తూ ఉంటే ఎక్కడ మైన్‌లు ఉన్నాయి? ఎటువంటి బాంబులు పడి ఉన్నాయి? అనేది తెలియని స్థితి. ఈ క్రమంలో ఈ అధ్యాపకురాలు అనాస్టసిలా మించుకోవా మందుపాతరలు ఏరివేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతోంది. ఆంగ్ల టీచరుగా తాను ఇటువంటి పనిచేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, అయితే జీవితంలోని ఘట్టాలు మనిషికి కొత్త పాఠాలు నేర్పుతాయని ఇప్పుడు తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రమాదకర సంకేతాలు ఉన్న రష్యన్లు అమర్చిన మందుపాతరల జాగాల్లోకి ఈ యువతి ముఖానికి దట్టమైన షీల్డ్ ధరించి, చేతుల్లో మందుపాతరలను కనుగొనే డిటెక్టర్‌ను చేతిలో బెత్తంగా పట్టుకుని వెళ్లుతుంటారు.

ఉక్రెయిన్‌లోని కోసోవోలో మించుకోవా మరో ఐదుగురు మహిళలు ఇప్పుడు మందుపాతరలు పసికట్టడం వారిని ఏరివేయడం పనిలో పడ్డారు. సంబంధిత విషయంలో తగు శిక్షణ తీసుకున్నారు. రష్యా సేనలు ఉక్రెయిన్ అణువణువునూ వదలకుండా బాంబుల దాడితో ఛిన్నాభిన్నం చేస్తూ, తమ స్వైరవిహారానికి గుర్తుగా పలు చోట్ల మందుపాతరలు అమర్చివెళ్లుతున్నాయి. దీనితో పౌరులు అడుగు తీసి అడుగేస్తే ఎక్కడ నెత్తిమీద పిడుగులుగా మందుపాతరలు పేలుతాయో అనే భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ దశలో ఈ ఉపాధ్యాయిని ఇతరులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా మందుపాతరల ఏరివేతతో ఉక్రెయిన్ మరణాలను నివారిస్తున్నారు. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదని , పలు దిక్కుల పలు లోతుల ఉన్న మైన్స్‌ను తీసివేసే క్రమంలో ఎంతో పనిచేయాల్సి ఉందని తెలిపారు.

ఇదీ ఓ ఉపాధి పనే

ఓ మాల్టా కేంద్రపు కంపెనీ ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతపు పెజాలో ముందుపాతరల ఏరివేతకు 18 రోజుల స్వల్పకాలిక శిక్షణా శిబిరం నిర్వహిస్తోంది. ఉపాధి పొందాలనుకునేవారికి ఇక్కడ రెగ్యులర్ కోర్సులు పెట్టింది. ప్రభుత్వ సంస్థలు, మానవీయ సంస్థలు, ఇంతకు ముందటి యుద్ధ క్షేత్రాలలో పనిచేసే వారికి ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటువంటి మైన్స్ ఏరివేతకు శిక్షణ ఇచ్చే ఈ కోసోవోకు యుద్ధ చరిత్ర ఉంది. అల్బనియా తెగలకు, సెర్బియన్ సైనిక దళాలకు మధ్య 1998 99 సాయుధ ఘర్షణలదశలో దాదాపు 13 వేల మంది చనిపొయ్యారు. వేలాది మంది ఈ ప్రాంతం వదిలి పారిపొయ్యారు. అయితే ఘర్షణలు ముగిసినా ఇక్కడ నిక్షిప్తంగా నిక్షేపంగా ఉన్న మైన్స్ పౌరులకు గుండెకోతగా మారాయి.

ఈ దిశలో ఇక్కడ మందుపాతర ఏరివేత అవసరాన్ని గుర్తించి మాల్టా కంపెనీకి అనుబంధం అయిన ప్రెయిడియమ్ కన్సల్టింగ్ సంస్థ మందుపాతరలు , బాంబుల ఏరివేతకు రంగంలోకి దిగింది. కొసోవో సంస్థకు శిక్షకుడిగా అర్తూర్ టిగానీ ఉన్నారు. 23 ఏళ్ల క్రితం ఇక్కడి మందుపాతరల ఏరివేత జ్ఞాపకాలు చేదు నిజాలు ఇప్పటికీ తమ కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయని, ఇప్పుడు ఆ అనుభవాలను రంగరించుకునే మైన్స్ ఏరివేతకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 1980 ప్రాంతంలో యుగోస్లావియాలో ఇంజనీరుగా పనిచేసిన టిగాని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో మైన్స్ ఏరివేతలకు తమ బృందాలతో వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News