Monday, December 23, 2024

గన్స్‌తో ఉక్రెయిన్ వీరవనితలు

- Advertisement -
- Advertisement -

Ukrainian women with guns

 

కీవ్: ప్రపంచవ్యాప్తంగా మహిళలకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం వేడుకగా సాగిన దశలో ఉక్రెయిన్‌లో సైన్యంలోని మహిళలు భుజాన తుపాకులతో వీరోచిత పోరు సంకల్ప బలంతో ముందుకు సాగారు. రష్యా అతిక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ దళాలు సాగిస్తున్న పోరులో ఈ అసాధారణ మహిళల బృందం పోరులో తాము ముందుండి సాగుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ మహిళా సైనికుల స్ఫూర్తి వారి పోరాట పటిమ అంతర్జాతీయ స్థాయిలో అందరి మన్ననలు పొందింది. మహిళా సైనికుల ఫోటోలు ఆన్‌లైన్‌లో వెలువడ్డాయి. వారు సైనిక దుస్తులలో చేతులలో రైఫిల్స్‌తో కన్పించారు. శత్రువును తుదముట్టించే పోరులో తాము తమ వంతు పాత్రను ఎవరికి తీసిపోకుండా నిర్వరిస్తామని ఈ సందర్భంగా ఓ సైనికురాలు ధైర్యంగా తెలిపారు.

తమ నేల ఇక్కడి ప్రజలను కాపాడుకునేందుకు తాము మగవారిని సైన్యంలోకి పంపించామని, వీరితో పాటు తాము కూడా ముందుకు వెళ్లుతున్నామని తెలిపారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. ముందు వారి ప్రాణాలను కాపాడటం తమకు ప్రధానమని తెలిపారు. ఇక్కడి జన్యుక్రమాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉంది. ఉక్రెయిన్‌లోని అంగుళం అంగుళం మేర శత్రువును నాశనం చేసి తీరుతామని ప్రకటించారు. ఇక్కడి గృహాలు శిథిలం కావచ్చు, జీవన పథంలో త్రోటుపాటు కన్పించవచ్చు, వీధులు రకసిక్తం అయి ఉండొచ్చు, అయితే అన్ని వైపుల నుంచి ఇక్కడి ప్రజలు మొక్కవోని ధైర్యం ఆయుధంగా చేసుకుని ఆక్రమణకు దిగుతోన్న శత్రువును దెబ్బతీయడం ఖాయం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News