Thursday, January 23, 2025

స్కాట్లాండ్ రోడ్డుపై తిరుగాడిన తొలి స్వయంచాలిత బస్సు!

- Advertisement -
- Advertisement -

 

UK's Self-driving Bus

ఇడిన్ బర్గ్: యూకె రూపొందించిన తొలి స్వయంచాలిత బస్సు సోమవారం స్కాట్లాండ్ రోడ్డుపై ప్రయోగాత్మకంగా నడిచింది. కొన్ని నెలల్లోనే ప్రయాణికులను రవాణా చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. స్కాటిష్ మీడియా నివేదిక ప్రకారం ఈ బస్సుకు సెన్సార్లు అమర్చారు. ఇదివరకే నిర్ధారించుకున్న రోడ్లపై ఈ బస్సు నడుస్తుంది. కనుక దీనికి సేఫ్టీ డ్రయివర్, నియంత్రించాల్సిన అవసరం ఉండదు. ఈ బస్సు 36 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. వంతెనపై 14 మైళ్లు(22కిమీ.) నడుస్తుంది. వారానికి 10వేల మంది ప్రయాణికులను తిప్పగలిగే సామర్థం దీనికుంది. స్కాటిష్ ప్రభుత్వం మద్దతుతో ప్రాజెక్ట్ సిఎవిఫోర్త్ కింద అటానమస్ బస్ సర్వీస్ దీనిని నడుపనుంది. ఇది ఫెర్రీటోల్ పార్క్ నుంచి ఫోర్త్ రోడ్ బ్రిడ్జి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ మీదుగా ఇడిన్‌బర్గ్ పార్క్ వరకు ఈ బస్సు నడువనుంది. వాస్తవానికి సిఎవి ఫోర్త్ ప్రాజెక్ట్ కింద ఇది 2019లోనే ఆరంభించాల్సింది. కానీ కొవిడ్19 ప్రభావం కారణంగా ఆలస్యం అయింది. ఈ బస్సుకు ఆరు స్థాయిల డ్రయివింగ్ ఆటోమేషన్ ఉంది. జీరో నుంచి రెండు వరకు డ్రయివర్ నిరంతరం పర్యవేక్షిస్తుండాలి, నడిపిస్తుండాలి. కాగా మూడో లెవల్ నుంచి ఐదో లెవల్ వరకు ఈ బస్సు స్వయం చాలితంగానే నడుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News