గువహతి: కిడ్నాపైన ఒఎన్‌జిసి ఉద్యోగి రితుల్ సైకియాను ఉల్ఫా(ఐ) మిలిటెంట్లు భారత్‌కు అప్పజెప్పారు. నాగాల్యాండ్‌లోని లోంగ్వా గ్రామ సమీపంలో మయన్మార్ వైపు సరిహద్దున రితుల్‌ను శనివారం ఉదయం 7 గంటలకు విడుదల చేశారు. అక్కడి నుంచి 40 నిమిషాల కాలినడక తర్వాత రితుల్ భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. రితుల్‌ను నాగాల్యాండ్‌లోని మాన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్టు అసోం అదనపు డిజిపిస్థాయి అధికారి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయణ్ని అసోం తీసుకువెళ్తామని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం రితుల్‌ను జోర్‌హత్ జిల్లా తీతాబర్‌లోని అతని ఇంటికి చేరుస్తామని తెలిపారు. ఏప్రిల్ 21న ఒఎన్‌జిసికి చెందిన ముగ్గురు ఉద్యోగుల్ని ఉల్ఫా తీవ్రవాదులు అసోంనాగాల్యాండ్ సరిహద్దులోని లక్వా చమురు క్షేత్రం నుంచి అపహరించారు. మయన్మార్ సరిహద్దున నాగాల్యండ్‌లోని మాన్ జిల్లాలో ఉల్ఫా తీవ్రవాదులతో ఏప్రిల్ 24న జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగా మిగతా ఇద్దరు ఉద్యోగుల్ని భద్రతాదళాలు కాపాడాయి. ఉల్ఫా ఇటీవల మూడు నెలల ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించిన నేపథ్యంలోనే రితుల్‌ను విడుదల చేసినట్టు భావించాలి.