Friday, December 20, 2024

‘ఏజెంట్ ‘ నుంచి అఖిల్ అల్ట్రా-స్టైలిష్ పోస్టర్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్ ‘ ఫస్ట్ లుక్ , టీజర్ , పాటల, గ్లింప్స్ తో అంచనాలు భారీగా నెలకొల్పింది. ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఈరోజు అనౌన్స్ చేశారు. అఖిల్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా అల్ట్రా స్టైలిష్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. రిలీజ్ ప్రమోషన్స్ ని కిక్‌స్టార్ట్ చేసిన రిలీజ్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రాబోయే రోజుల్లో చాలా ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లు రాబోతున్నాయి.

‘ఏజెంట్‌’తో సమ్మర్ రేస్‌లో లోకి వచ్చారు అఖిల్. లాంగ్ హాలిడేస్ సినిమాకు చాలా అడ్వాంటేజ్ కానున్నాయి. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో భారీ పేలుడు జరుగుతున్నప్పుడు, మెషిన్ గన్ పట్టుకుని ఫెరోషియస్ గా నడుచుకుంటూ వస్తూ అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించాడు. ఏజెంట్ స్పై హై యాక్షన్ ఎంటర్‌టైనర్. సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్, క్యారెక్టర్‌లో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News