Wednesday, January 22, 2025

ఉమాభారతి హిమాలయాల ప్రయాణం

- Advertisement -
- Advertisement -

భోపాల్ : ఫైర్‌బ్రాండ్ నాయకురాలు ఉమా భారతి ఇక తాను హిమాలయాలకు వెళ్లుతున్నట్లు ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రెండు దశాబ్దాల పాటు ఉమాభారతి తమ ప్రాబల్యం చాటుకున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దశలో సొంతపార్టీ బిజెపి నుంచి ఆమెకు ఎటువంటి గుర్తింపు దక్కలేదు. చివరికి పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపైనర్ల జాబితాలోనూ ఉమాభారతికి చోటు కల్పించలేదు. అయితే తాను సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తరఫున ఆయన కోరితే పోటీ చేస్తానని కూడా ఉమాభారతి ప్రకటించారు. అయితే అటు నుంచి ఎటువంటి పిలుపు రాలేదు.

దీనితో ఇక ఈ మాజీ ముఖ్యమంత్రిణి ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కనీసం తనకు ప్రచారానికి అయినా పిలిచారని , ఇప్పుడు అదీ లేకుండా పోయిందని, తాను క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, పార్టీ విజయం కోసం పాటుపడే వ్యక్తినని కానీ ఇందుకూ అంగీకరించకపోవడం దారుణం అని తెలిపిన ఉమా తాను తన జన్మస్థలి దుండా గ్రామానికి వెళ్లుతున్నట్లు, అక్కడ కులదేవతకు పూజించి తరువాత హిమాలయాలకు వెళ్లుతా అని ఆమె వైరాగ్యం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News