Wednesday, January 22, 2025

85 ఏళ్లు వచ్చినా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటా : ఉమాభారతి

- Advertisement -
- Advertisement -

భోపాల్ : చాలా కాలంగా రాజకీయాల్లో పనిచేస్తున్నానని, ఐదేళ్లు విరామం తీసుకోవాలనుకుని ఎన్నికల్లో పోటీ చేయలేదు తప్ప రాజకీయాల నుంచి తప్పుకోలేదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి అన్నారు. “రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రజలు భావిస్తున్నారు. నాకు 85 ఏళ్లు వచ్చినా రాజకీయాల్లో చురుకుగా ఉంటాను. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాను. నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం. విలాసాల కోసమే రాజకీయాలు అని భావించే వారి వల్ల రాజకీయ వ్యవస్థ నాశనమైందని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తనపై వస్తోన్న వార్తలపై ఆమె స్పందించారు.

మధ్యప్రదేశ్ లోని బుందేల్‌ఖండ్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో జన్ ఆశీర్వాద్ యాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ సమావేశానికి ఆమెను ఆహ్వానించక పోవడంతో అసంతృప్తిని ఆమె వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 2003లో ఉమాభారతి మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనకు ముగింపు పలికి బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయితే ఆమె క్రమశిక్షణారాహిత్యానికి 2005లో బీజేపీపార్టీ నుంచి బహిష్కరించింది. అనంతరం మళ్లీ 2011లో తిరిగి పార్టీలో చేర్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News