Monday, December 23, 2024

ఘనంగా ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట రూరల్: మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వర లో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల తో పాటు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు పోటెత్తారు స్వామి దర్శనానికి బారులు తీరారు. ఉదయం గవ్యాంత పూజలు రుద్రాభిషేకం రుద్ర హోమం వహిత దేవత హోమములు మూర్తి హోమం శేష హోమం పూర్ణాహుతి వసంతోత్సవం శేష వాహన సేవ త్రిశూల స్నానం రుజావరోహణం పుష్పోత్సవం ఏకాంత సేవ పాండిత్య సత్కారములు పాప నాశనమునందు ఉత్తరాయణ పుణ్యకాల స్థానంలో మరియు ప్రత్యేక పూజలు జరుగు భక్తులు శివనామ స్మరణతో నల్లమల్ల కొండలు మార్మోగాయి.

పాప నాశిని గుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామికి అభిషేకం అమ్మవారికికుంకుమార్చన చేశారు .ఆర్టీసీ అధికారులు కొండపైకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దేవస్థానం కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్ ఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో క్యూ లైన్ లో పంపించేందుకు వాలంటర్లను నియమించారు. అచ్చంపేట సీఐ అనుదీప్ ఆధ్వర్యంలో ఎస్సై గోవర్ధన్ పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. కొండపైకి ఆర్టీసీ బస్సులు తప్ప ఇతర వాహనాలను అనుమతించడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News