Monday, November 18, 2024

రేపటి నుండి ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం రంగాపూర్ గ్రామంలో వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగమూలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రమునకు ఉత్తర ద్వారకంగా బాసిల్లుతున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి గాంచినది. శ్రీరాముడు రావణసుర వదానంతరము శ్రీశైలం ప్రదక్షిణము ఈ క్షేత్రం నుండే ప్రారంభించినట్లు శ్రీశైలం పురాణము చెబుతుంది. ఇదిలా ఉండగా నేటి నుండి ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. కాగా అచ్చంపేట పట్టణం నుండి ఆదివారం భ్రమరాంబిక ఆలయం వద్ద నుండి స్వామివారికి ప్రత్యేక పల్లకిలో ఊరేగించి వేలాది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా ఆటపాటలతో నృత్యాలు చేస్తూ.. రాత్రి రెండు గంటల సమయంలో ఉమామహేశ్వరుని సన్నిధి వద్దకు చేరుకోవడం ఆనవాయితుగా నేటికీ కొనసాగుతున్న ప్రక్రియ.

 

క్షేత్రంలో ప్రభ చేరిక అనంతరం ఉమామహేశ్వరం నుంచి ప్రత్యేక పల్లకిలో పార్వతి పరమేశ్వరునికి కొండ క్రింద భోగ మహేశ్వరం వద్దకు చేరుకున్న అనంతరం వేలాది భక్తుల సమక్షంలో దివ్య కళ్యాణ మహోత్సవం వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ జిల్లా ఎంపీ పోతుగంటి రాములు తో పాటు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరై, స్వామివారికి ప్రభుత్వపరంగా పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమామహేశ్వర క్షేత్రం దివ్యకాంతులతో ముస్తాబయింది.

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతాయి . ఉమామహేశ్వర ఆలయం పురాణ ప్రసిద్ధి గావించింది.  ఉమామహేశ్వర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటైన శ్రీశైల క్షేత్రమునకు ఉత్తర ద్వారకంగా బాసిలుతున్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధిగాంచినది అని భక్తులు విశ్వసిస్తారు. రాముడు రావణాసుర వదానంతరము ఉమామహేశ్వర ఈ ప్రాంతం నుండే శ్రీశైలానికి ప్రదక్షిణము ఏ క్షేత్రం నుండే ప్రారంభించినట్లు శ్రీశైలం పురాణము చెబుతుండడం ద్వారా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందని భక్తులు ప్రజలు విశ్వసిస్తారు. కాగా భక్తులకు కొలిచిన కొద్దీ కొంగు బంగారంగా ఉమామహేశ్వర క్షేత్రానికి నామకరణం ఉంది

భోగ మహేశ్వరం ప్రత్యేకతలు : ఉమామహేశ్వర క్షేత్రానికి కొండ క్రింద ఉన్న ప్రాంతానికి భోగ మహేశ్వరం అని పేరు పూర్వం యాత్రికులంతా పైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరిగి ప్రయాణించే ఈ ప్రాంతంలోనే వంటలు చేసుకునే వారని.. అప్పుడు ఈ ప్రాంతంలో ఒక గ్రామం కూడా ఉన్నదని.. క్రీస్తు శకం 1280లో కరణం రామయ్య ఇక్కడ భోగ మహేశ్వరంలో కాకతీయ రుద్రమదేవి పేరు చలమూర్తి గండ రుద్దేశ్వర ప్రతిష్ట చేశారని, అప్పట్లో ఆయన భార్యలైన మల్లాసాని అనురాధ దేవర చెన్న సోమనాథ దేవర చిన్న మల్లనాద సోమేశ్వర దేవరాల పేర్ల ఐదుగుడులు కట్టించి లింగా ప్రతిష్ట చేయించడం తో పాటు ఈ ఐదు లింగాలు ఒకే ఆవరణలో ఉన్నవి కనుక వాటిని పంచలింగాలు అని నామకరణం నేటికి కొనసాగుండుతున్నడం ద్వారా భోగ మహేశ్వరం ప్రత్యేకతలుగా భావించి దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఉమామహేశ్వర క్షేత్ర ఆలయ మహిమలు : ఉమామహేశ్వర క్షేత్రానికి 11 తీర్థం తీర్థములు గలవు తద్వారా మహా క్షేత్రముగా పేరు ప్రకతులు గావించినది కాగా స్వామి వారు తుమ్మెద మామిడి చెట్టు కింద కొలువుదీరి వచ్చిన భక్తులకు దర్శనమిస్తున్నాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలోని 11 తీర్థములలో ముఖ్యమైనవి రుద్రా ధార, భస్మధార, గౌరీ ధార, పాప నాశనం మొదలగునవి ఇవన్నీ నిరంతరం ప్రక్రియగా నేటికీ కొండపై నుంచి జాలు జారుతున్నాయి, ప్రతి భక్తుడు ముందుగా పాప నాశనమునకు వెళ్లి స్నానం ఆచరించినచో సకల పాపములు దోషములు రోగా బాధల నుండి విముక్తిని పొందగల విశిష్టతలు గా భావించవచ్చు.

ఎంతో ప్రసిద్ధిగాంచిన ఉమామహేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే వేలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఈవో శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ తెలిపారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా భోగ మహేశ్వరం నుంచి భక్తుల సౌకర్యార్థం కొరకు ఉమామహేశ్వర క్షేత్రానికి ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ ప్రాంతం పోలీస్ నిఘా నేత్రంలో కొనసాగుతుందని ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News