Tuesday, December 24, 2024

సుప్రీంకోర్టు సిజెఐగా ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

- Advertisement -
- Advertisement -

Umesh Uday lalit as Next Chief Justice of India

 

ఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టీస్ గా ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్‌ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ వరుసలో ఉన్నారు.  దీంతో ఆయన పేరును ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.  ఈ నెల 26వ తేదీన సిజెఐగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్‌ లలిత్‌ భారత 49వ సిజెఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్‌ 8 వరకే ఉంటుంది. సిజెఐగా  లలిత్ రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.  జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది రికార్డుకెక్కారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News