Tuesday, April 1, 2025

మళ్లీ తండ్రైన భారత పేస్‌ బౌలర్‌..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ పేస్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మళ్లీ తండ్రయ్యాడు. ఉమేశ్‌ భార్య తాన్యా వధ్వా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్‌ యాదవ్‌ తన ఇన్‌స్టా హ్యాండిల్‌ ద్వారా వెల్లడించాడు. ఉమేశ్‌ యాదవ్‌ పంజాబ్‌కు చెందిన తాన్యా వధ్వాను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.

2013 మే 29న వారి వివాహం జరిగింది. తాన్య 2021 జనవరి 1న తమ తొలి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో సంతనంగా కూడా ఆడబిడ్డే జన్మించింది. ఇదిలావుంటే మహిళా దినోత్సవం రోజున మహాలక్ష్మి తన ఇంట్లో అడుగుపెట్టడంతో ఉమేశ్‌ పట్టరాని సంతోషంలో ఉన్నాడు. ఇన్‌స్టాలో ఉమేశ్ పోస్టు చూసి అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News