Sunday, January 19, 2025

బొట్టు పెట్టుకోవడానికి నిరాకరించిన క్రికెటర్లు సిరాజ్, మాలిక్ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ఆస్ట్రేలియాపై ఫోర్ మ్యాచ్ టెస్ట్ సిరీస్ కోసం నాగపూర్ చేరుకున్న భారత క్రికెటర్లకు ఒక హోటల్‌లో స్వాగతం పలికిన సందర్భంగా సింధూరం బొట్టు పెట్టుకోవడానికి మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ నిరాకరించడం వివాదం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఇద్దరు ముస్లిం ఫాస్ట్ బౌలర్లపై హిందూత్వవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లతో దుమారం రేపుతున్నారు. రికార్డు స్థాయిలో ఇప్పటికే 84.21 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.

రాజస్థాన్ సాంప్రదాయం ప్రకారం హోటల్ సిబ్బంది క్రికెటర్లకు సింధూరం అద్ది స్వాగతం పలుకగా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ వారికి నుదుటన సింధూరం అద్దారు. అయితే.. సిరాజ్ వంతు వచ్చేసరికి బొట్టు పెట్టింపకోవడానికి అతను వినయంగా తిరస్కరించాడు. ఇమ్రాన్ మాలిక్ కూడా అదే రీతిలో స్పందించాడు. అన్వేష్క దాస్ పోస్ట్ చేసిన ఈ వీడియో హిందూత్వవాదుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News