- Advertisement -
కరోనా మరణాలపై ఐరాస అధినేత గుటెరస్ ఆందోళన
న్యూయార్క్ : కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మంది ప్రాణాలను బలిగొనడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదో భయంకరమైన మైలురాయిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభివర్ణించారు. అంతర్జాతీయ టీకా ప్రణాళికను పట్టాలెక్కించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మనం మహమ్మారిని ఓడించడానికి చాలా దూరం వెళ్లాల్సిన అవసరాన్ని ఈ భయంకరమైన మైలురాయి గుర్తు చేస్తోందని అన్నారు. మరిన్ని టీకాలు మరింత సమానత్వంతో మనం వేగంగా కదలాలి అని ట్విటర్ వేదికగా గుటెరస్ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. టీకా పంపిణీ వేగం కంటే వైరస్ వేగం ఎక్కువగా ఉందని, ఈ మహమ్మారిని అడ్డుకోకుంటే మరెందరో ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు.
UN chief Guterres’ concern over corona deaths
- Advertisement -