Monday, December 23, 2024

భారత్ మానవ హక్కుల రికార్డుపై యుఎన్ చీఫ్ సీరియస్

- Advertisement -
- Advertisement -

UN chief is serious about India's human rights record

ముంబై : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ తన మూడు రోజుల పర్యటనలో భారత్ మానవ హక్కుల రికార్డుపై విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఆయన ముంబై లో ప్రసంగిస్తూ ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, మహిళా రిపోర్టర్లపై దాడులు అధికమై పోయాయి. మానవ హక్కుల మండలిలో ఎన్నుకోవలసిన సభ్య దేశంగా భారత్‌కి ప్రపంచ మానవ హక్కులను రూపొందించడం, మైనారిటీ వర్గాల సభ్యులతో సహా అందరి హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం, వంటివి చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ల భారత్‌లో సాధించిన విజయాల గురించి కూడా ప్రశంసించారు. అలాగే భారత్‌లో వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదని, హక్కులు రక్షింపబడాలి. అలాగే ద్వేషపూరిత ప్రసంగాలను నిర్దంద్వంగా ఖండించి విలువలను కాపాడుకోవాలి. మానవ హక్కులను భారత న్యాయవ్యవస్థ నిరంతరం రక్షిస్తూ ఉండాలి. అని సూచించారు. ఈ ప్రసంగంలో భారత్ కర్బన ఉద్గారాలు తగ్గించే విషయం కూడా ప్రస్తావించారు. పునరుత్పాదక శక్తి కోసం లక్షాలను నిర్దేశిస్తున్నప్పటికీ భారత్ మాత్రం 70 శాతం బొగ్గును వినియోగిస్తోంది. భారత్ వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ చర్యలు మరిన్ని తీసుకోవాలి. ఆరవ వంతు మానవాళి అధికంగా ఉన్న భారత్ 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్షాలను సాధిస్తుందా ? లేక విచ్ఛిన్నం చేస్తుందా ? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News