- Advertisement -
ఐక్యరాజ్యసమితి: ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్(ఐఎస్‌ఐఎల్‌కె) సీనియర్‌నేత సనావుల్లాఘఫారీ(27)పై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆంక్షలు విధించింది. ఘఫారీ ఆస్తుల్ని జప్తు చేయాలని, అతని ప్రయాణాలపై నిషేధం అమలు చేయాలని భద్రతామండలి ఆదేశించింది. 2020 జూన్ నుంచి ఐఎస్‌ఐఎల్‌కెకు ఘఫారీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని భద్రతా మండలి తెలిపింది. డిసెంబర్ 21న ఘఫారీని ఆంక్షల జాబితాలో చేర్చినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఘఫారీని డాక్టర్ షాహెబ్‌గా, షాహెబ్ ముహజీర్‌గా ఆ సంస్థ సభ్యులు పిలుస్తారని తెలిపింది. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లలో జరిగిన పలు ఉగ్రదాడుల వెనుక మాస్టర్‌మైండ్ ఘఫారీయేనని తెలిపింది. 2021లో జరిపిన పలు దాడులతో వందలాదిమంది చావుకు ఘఫారీ కారకుడయ్యాని తెలిపింది. అఫ్ఠానిస్థాన్ సైన్యంపైనా, మైనార్టీలపైనా ఐఎస్‌ఐఎల్‌కె ఉగ్రదాడులు జరుపుతోందని భద్రతా మండలి తెలిపింది.
- Advertisement -