Saturday, December 21, 2024

దేశం పేరు మార్చమంటే చూస్తాం: ఐరాస

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : దేశాల పేర్ల మార్పిడి అంశంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. పేరు మార్చాలని సంబంధిత దేశం నుంచి తమకు సరైన రీతిలో అభ్యర్థన అందితే తాము దీనిపై తగు విధంగా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఐరాస ప్రతినిధి తెలిపారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు రంగం సిద్ధం అవుతోందని ఈ దిశలోనే జి 20 సదస్సు ఆహ్వాన పత్రాలలో ఇండియా బదులు భారత్ అనే పేరు పెట్టారనే వార్తల నేపథ్యంలో ఈ విషయంపై ఐరాస ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ స్పందించారు. ముందు పేరు మార్పిడిపై ఆయా దేశాల నుంచి తమకు అధికారికంగా వినతి అందాల్సి ఉంటుందని వివరించారు. గత ఏడాది టర్కీ నుంచి ఈ మేరకు అభ్యర్థన అందిందని, తమ దేశ పేరును టర్కియేగా మార్చాలని కోరారని తెలిపారు. ఆ ప్రభుత్వం నుంచి అధికారికంగా తమకు ఈ విషయంలో లేఖ అందిందని, దీనిపై తాము స్పందించామని వివరించారు. ఇండియా పేరు కూడా మార్చడానికి వీలుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News