Sunday, December 22, 2024

నియంత పోకడ భరించలేక పార్టీని వీడుతున్న

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : 2014లో బిజెపిలో చేరిన సంకినేని వెంకటేశ్వరరావు పార్టీలో నియంత వ్యవహరిస్తూ తాను వచ్చాకే పార్టీ అభివృద్ధి చెందిందని పేర్కొంటూ పాత కొత్త బిజెపి నాయకులను వేరు చేసి చూడడం బాధగా ఉందని సీనియర్ బిజెపి నాయకులు, బిజెపి జిల్లా కార్యాలయ కార్యదర్శి కొండేటి ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి క్రియాశీల సభ్యత్వానికి, జిల్లా కార్యాలయ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను చేరిన తర్వాతే బిజెపి పార్టీ అభివృద్ధిలోకి వచ్చిందని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2014 కు ముందు బిజెపి ఒక మున్సిపల్ ఛైర్మన్ పదవి, పలువురు కౌన్సిలర్లను గెలిపించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంగా మార్చి అలుపెరగకుండా శ్రమిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడనై త్వరలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News