Friday, January 24, 2025

అత్తింటి వేధింపులు తాళలేక పిలల్లతో సహా అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం 

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ క్రైం: అత్తింటివారి వేధింపులకు తాళలేక నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు వారి ముగ్గురు పిల్లలతో కలిసి శుక్రవారం ఎడపల్లి మండలంలోని అశోక్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన జాలర్లు నలుగురిని కాపాడగా ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం… నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్షయ (28), నిఖిత (26)లను మెదక్, హైదరాబాద్‌లకు చెందిన వారితో వివాహం జరిపించారు. తండ్రి పెళ్లి సమయంలోనే కట్నంగా కొత్త కలెక్టరేట్ సమీపంలో 200 గజాల ప్లాటు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ మేరకు నిఖిత, అక్షయల పేర్లపై పత్రాలు సైతం వారికి ఇచ్చేశారు.

కాగా ఆ ప్లాట్లుకు వెళ్లడానికి దారిలేకపోవడంతో వాటిని కొనుగోలు చేసేవారు లేకుండా పోయారు. దీంతో అక్కా చెల్లెల్లను అత్తింటివారి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. కట్నంగా ఇచ్చిన ప్లాట్లను అమ్మేయాలని అప్పుడే తిరిగి రావాలని అక్కాచెల్లెల్లకు అత్తింటివారు హెచ్చరించారు. దీంతో వారు వారిద్దరూ నాలుగు రోజలు కిందటే పుట్టింటికి వచ్చేశారు. అయితే ఈ ప్లాట్లను విక్రయించడానికి తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిత, అక్షయతోపాటు వారి పిల్లలు భవ్యశ్రీ(6), శ్రీమాన్ (4), భువనేశ్వర్ (3)తో కలిసి శుక్రవారం ఉదయం ఎడపల్లి మండలం అశోక్‌సాగర్‌కు వెళ్లి పిల్లలతోపాటు దూకేశారు. చేపలు పట్టేవారు వీరిని గమనించి వెంటనే చెరువులో నుంచి వీరిని బయటకు తీసి కాపాడారు. నిఖిత, అక్షయలతోపాటు భవ్యశ్రీ, శ్రీమాన్లను కాపాడి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాని భువనేశ్వర్ మాత్రం చెరువులోనే గల్లంతు కాగా జాలర్లు గాలించగా చిన్నారి మృతదేహం లభించింది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News