కెసిఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా…
11శాతం వడ్డీకి రూ.1.50లక్షల కోట్ల రుణాలు తెచ్చిన గత ప్రభుత్వం
ఈ వడ్డీ రేటును 5శాతానికి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా ప్రభుత్వ
ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ బకాయిలే రూ.8వేల కోట్ల పైచిలుకు
జాబ్ క్యాలండర్‌తో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాల్సిందే మీరు
ఆదేశిస్తే కోదండరాం తలుపులు పగులగొట్టిన పోలీసులు మేము ఆదేశిస్తే
కెటిఆర్ ఇంటి తలుపులు పగుల గొట్టరా? సిఎంకు విజ్ఞత ఉండాలి..
అది లేకే కెసిఆర్ బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు నేను సిఎం
అయినా.. టెంపర్ కోల్పోలేదు కారుణ్య నియామక పత్రాల అందజేత
కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వం కే వలం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకుందని,నిరుద్యోగులను నట్టేట ముంచిందని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పడిన త ర్వాత ఒక్క ఏడాది పాలనలో 55 వేల ఉ ద్యోగ నియామకాలు చేశామని ఆయన తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 500 పైచిలుకు గ్రూప్1 ఉద్యోగాలు ఇచ్చింది తామేనని ఆయన అన్నా రు. గత బిఆర్‌ఎస్ ప్రభు త్వం 2015 నుంచి కారుణ్య నియామకా లు నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. రవీంద్ర భారతిలో గురువారం ‘కొలువుల పండుగ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, పురపాలక శాఖ ల్లో కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు నేడు సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సం దర్భం గా ఆయన మాట్లాడుతూ నా మీద వ్యతిరేకత, కోపం ఉందని కొందరు అంటున్నారు.
రైతు రుణ మాఫీ చేసినందుకు నాపై కోపం గా ఉన్నా రా..? మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం కల్పించినందుకు కోపంగా ఉన్నా రా..? మహిళలను కోటీశ్వరులను చేసేందు కు ప్రయత్నం చేస్తున్నందుకు కోపంగా ఉ న్నారా..? 59 వేల మందికి ఉద్యోగాలు ఇ చ్చినందుకు నాపై కోపంగా ఉన్నారా..? దే నికి ప్రజలు నాపై కోపంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలపై సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డా రు. అలాగే, రేవంత్ రెడ్డికి పాలన మీద ప ట్టు రాలేదంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. రాజయ్యను కార ణం లేకుండా మంత్రి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అందుకే ఇవాళ సామాన్యుడు కూడా సెక్రటేరియట్‌కు వస్తున్నారని ఆయన తెలిపారు. నేను ఆదేశాలు ఇస్తే కెటిఆర్ ఈపులు పగొలగొట్టరా..? కోదండరామ్ ఇంటి తలుపులు పగలగొట్టినోళ్లు కెటిఆర్ ఇంటి తలుపులు పగలకొట్టడం ఎంతసేపు వాళ్లలాగే మేం అణిచివేయాలనుకుంటే ఎక్కువ సేపు పట్టదని ఆయన పేర్కొన్నారు.
ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఎవరూ ఇవ్వలేదు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది నిరుద్యోగులు ప్రాణ త్యాగం చేశారని, కానీ, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నేరవేరలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించలేదని ఆయన విమర్శించారు. మేం అధికారంలోకి రాగానే ఈ అంశంపై దృష్టి పెట్టామని అందులో భాగంగానే 50 వేల మందికి వాళ్ల కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని సిఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలకు తామే నోటిఫికేషన్లు ఇచ్చామని బిఆర్‌ఎస్ అంటోందని, మరీ పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని, నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేదని సిఎం రేవంత్ బిఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. ఇప్పటి వరకు మేం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 59 వేలని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఎవరూ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంట్నే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, కోర్టుల్లో కేసులు వేస్తున్నాయని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బిఆర్‌ఎస్ ఓడింది
వాళ్లు చేయలేని పని మేం చేస్తుంటే బిఆర్‌ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బిఆర్‌ఎస్ ఓడిపోయిందని, తమకు ఉద్యోగాలు ఇవ్వని మీకు ఉద్యోగాలు ఎందుకని నిరుద్యోగులు బిఆర్‌ఎస్‌ను ఓడించారని సిఎం రేవంత్ అన్నారు. పదేండ్లు నిరుద్యోగుల జీవితాన్ని బిఆర్‌ఎస్ వృధా చేసిందని సిఎం రేవంత్ విమర్శించారు. తెలంగాణ కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో మంది త్యాగం చేశారని దేని కోసం అయితే వారు కొట్లాడారో ప్రత్యేక రాష్ట్రంలో వాళ్ల ఆకాంక్షలు నేరవేరలేదని సిఎం రేవంత్ వాపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అన్ని పరీక్షలు చిత్తశుద్ధితో నిర్వహించామని ఆయన తెలిపారు. గతంలో నోటిఫికేషన్లు వేయాలని ధర్నాలు చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని, ఇప్పుడే పరీక్షలు వద్దని నిరుద్యోగులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కెసిఆర్‌కు బిడ్డ, కొడుకుపై ఉన్న ప్రేమ, పేద పిల్లలపై లేదని, ఆయన ఇంట్లో నాలుగైదు ఉద్యోగాలు, పేదల పిల్లలకు మాత్రం ఉద్యోగాలు వద్దా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు.
తెలంగాణలో శివుడి ఆలయాలు ఏమైనా తక్కువ ఉన్నాయా..?
ఈ సందర్భంగా టిటిడి దర్శనం గురించి సిఎం రేవంత్ సంచలన వ్యఖ్యాలు చేశారు. తిరుమల దేవస్థానం దర్శనం గురించి ఎపి ప్రభుత్వాన్ని, టిటిడి అధికారులను ప్రతిసారి అడుక్కోవడం ఏమిటని సిఎం రేవంత్ ప్రశ్నించారు. వాళ్లకు టిటిడి ఉంటే మనకు వైటిడి (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా ఎందుకు ప్రతిసారి బ్రతిమాలుకోవడం ఎందుకని సిఎం రేవంత్ అన్నారు. భద్రాచలంలో రాముడు లేడా మనకు శివుడి ఆలయాలు ఏమైనా తక్కువ ఉన్నాయా..?” అంటూ ఆయన ప్రశ్నించారు. టిటిడి వెళ్లి బ్రతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఈ ఆలయాలకు వెళ్లొచ్చని సిఎం రేవంత్ అన్నారు.
రిటైర్ అయిన ఉద్యోగులకు రూ.8వేల కోట్ల బకాయిలు చెల్లించాలి…
రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాల్సి ఉందని, ఎలా తీసుకొచ్చి వారికి చెల్లించాలని, ఎక్కడా అప్పు పుట్టడం లేదని, అప్పు ఇవ్వడానికి ఎవ్వరూ మనల్ని నమ్మడం లేదని సిఎం రేవంత్‌రెడ్డి వాపోయారు. అబద్ధాల పునాదుల మీద తాము ప్రభుత్వాన్ని నడపలేమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం భారీగా అవినీతి, దుబారాకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ అప్పులు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ పథకాల్లో పారదర్శకంగా వ్యవహారించాలని…
ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, ప్రభుత్వ పథకాల్లో పారదర్శకంగా వ్యవహారించాలని తమ ఎమ్మెల్యేలకు చెబుతుంటానని సిఎం రేవంత్ వెల్లడించారు. కార్యకర్తలకే ఇవ్వాలంటే పార్టీ పదవులు ఇద్దామని, ప్రభుత్వ పథకాల విషయంలో మాత్రం పార్టీలను చూడొద్దని ఎమ్మెల్యేలకు సూచించానని ఆయన అన్నారు. అసలైన అర్హులకు పథకాలను తప్పక వర్తింపచేయాలని ఆయన సూచించారు.
జీఎస్టీ వసూళ్లలో 17 శాతం పెరుగుదల
స్వాతంత్య్రం వచ్చి ఈ 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటివరకు దేశంలో కులగణన జరగలేదని, సమాజానికి ఎక్స్ రే వంటి కులగణన దేశమంతా జరగాలని రాహుల్‌గాంధీ చెప్పారని సిఎం అన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టామని, ఎస్సీల వర్గీకరణ కోసం 35 ఏళ్లుగా ఉద్యమం సాగుతోందని, దశాబ్దాలుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టామని ఆయన గుర్తు చేశారు. కొన్ని శాఖల్లో ఆదాయం పెరిగిందని అందులో భాగంగా ఒక్క ఇసుక విక్రయంలోనే రోజువారీ ఆదాయం రూ.3 కోట్లు పెరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లలో 17 శాతం పెరుగుదల నమోదు అయ్యిందని, ధరల పెరుగుదలను నియంత్రించడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని ఆయన వివరించారు