Wednesday, January 22, 2025

అన్ అకాడమీ యూఎన్ఎస్ఏటీ 2023 పరీక్ష..

- Advertisement -
- Advertisement -

భారతదేశపు అతిపెద్ద లెర్నింగ్ ఫ్లాట్ ఫామ్ గా గుర్తింపు తెచ్చుకుంది అన్ అకాడమీ. ఎంతోమంది విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా విద్యాబోధన చేసి వారి కలలను సాకారం చేసుకునే విధంగా కృషి చేసింది. అంతేకాకుండా అన్ అకాడమీ జాతీయ స్కాలర్ షిప్ అడ్మిషన్ టెస్ట్ (UNSAT) ద్వారా ఐఐటీ, జేఈఈ, నీట్ యూజీ అభ్యాసకులకు ఎప్పటికప్పుడు సహాయసహకారాలను అందిస్తోంది. ఇప్పుడు ఈ టెస్ట్ ను మూడోసారి నిర్వహిస్తోంది అన్ అకాడమీ. ఈ టెస్ట్… నీట్, జేఈఈ పరీక్షలను సాధించాలనుకునే విద్యార్థులకు అద్భుతమైన అవకాశం. దీనిద్వారా విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా పెంచుకుని, నీట్, జేఈఈ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేందుకు అవకాశం లభిస్తుంది.

యూఎన్ఎస్ఏటీ 2023 పరీక్షకు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

● పరీక్ష తేదీలు:  2023 అక్టోబరు 1, 8, 15 (రెండు స్లాట్లు: మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు, సాయంత్రం 6 – 7 గంటల వరకు)

● పరీక్ష విధానం: ఆన్ లైన్, ఆఫ్ లైన్
● అర్హత ప్రమాణాలు: 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, 12వ తరగతి పాస్ అయినవాళ్లు, ఐఐటీ & నీట్ పరీక్షకు సిద్ధం అవుతున్నవాళ్లు.

● పరీక్ష ఫీజు: ఆన్ లైన్ ఉచితం, ఆఫ్ లైన్ రూ. 100
● ఫలితాల ప్రకటన: నవంబరు 2, 2023.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News