Monday, December 23, 2024

ఉనద్కత్ సంచలన హ్యాట్రిక్..

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ రంజీట్రోఫీలో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు. సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కత్ ఈ మ్యాచ్‌లో అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టడం విశేషం. పేస్‌దాడికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆరుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరగడం ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌరాష్ట్ర తరఫున బౌలింగ్‌కు దిగిన ఉనద్కత్ తొలి ఓవర్లో మూడో బంతికి షోరే నాలుగో బంతికి ఐదో బంతికి కెప్టెన్ యశ్‌ధుల్(0) వికెట్లును వరుస బంతుల్లో పడగొట్టాడు. షోరేను క్లీన్‌బౌల్డ్ చేసిన ఉనద్కత్ ఆ తర్వాత బంతికి రావల్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ఉనద్కత్ బౌలింగ్‌లో హార్విక్‌దేశాయ్ చేతికి చిక్కిన రావల్ వెనుదిరిగాడు. హ్యాట్రిక్ వికెట్‌గా యశ్‌ధుల్‌ను వికెట్లు ముందు బోల్తా కొట్టించిన ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు. మొత్తం మీద తొలి ఇన్నింగ్స్‌లో 35ఓవర్లో 133పరుగులు చేసి ఆలౌటైంది. 68పరుగులుతో హాఫ్‌సెంచరీ నమోదుచేసిన హృతిక్ షోకీన్ అజేయంగా నిలిచాడు. సౌరాష్ట్ర సారథి ఉనద్కత్ 8వికెట్లు తీయగా మన్కడ్ చెరో వికెట్ తీశారు.

అనంతరం సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఓ వికెట్ నష్టానికి చేసింది. ఓపెనర్ హార్విక్ దేశాయ్ 15ఫోర్లుతో 104పరుగులు చేసి అజేయ సెంచరీతో కొనసాగుతున్నాడు. జేగోహిల్ (34) హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో ఔటవగా (44) క్రీజులో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News