- Advertisement -
కాబూల్: బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పకుండా హిజాబ్ ధరించాలన్న తాలిబన్ల తాజా డిక్రీపై అఫ్గానిస్థాన్ లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యుఎన్‌ఎఎంఎ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల అంతర్జాతీయ సమాజానికి అఫ్గానిస్థాన్ మరింత దూరం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. తమకు అందిన సమాచారం ప్రకారం ఇదేమీ ప్రతిపాదన కాదని, అధికారిక ఆదేశమని, హిజాబ్ డిక్రీని అమలు చేయనున్నారని తెలుస్తోందని పేర్కొంది. మహిళలు, బాలికలు సహా అఫ్గానీలందరికీ రక్షణ కల్పిస్తామని, వారి మానవ హక్కులను కాపాడతామని గత దశాబ్దకాలంగా చర్చల సందర్భంగా అంతర్జాతీయ సమాజానికి తాలిబన్లు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఇది ఉందని యునామా తెలిపింది. తాజా ఆదేశాలపై మరింత స్పష్టత కోసం తాలిబన్ ముఖ్య నేతలతో సమావేశం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపింది.
- Advertisement -