Tuesday, November 5, 2024

‘అపరాజిత’ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: తీవ్ర విమర్శల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు’ను మంగళవారం ప్రవేశపెట్టింది. దానిపై చర్చ అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఈ బిల్లు చారిత్రాత్మకం అన్నారు. గవర్నర్ ఈ బిల్లుపై సంతకం చేయాలని విపక్షం అడగాలన్నారు. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత తమదన్నారు. బిల్లు ఆమోదం పొందితే అపరాజిత టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని, బాధితులకు సత్వర న్యాయం అందిస్తామని అన్నారు. ఉన్నావ్, హథ్రాస్ కేసుల్లో న్యాయం గురించి ఎవరూ మాట్లాడ్డం లేదని, కానీ బెంగాల్ ఘటనపై మాట్లాడుతున్నారని విమర్శించారు.

అపరాజిత బిల్లుపై బిజెపి చేసిన సూచనలకు ఆమోదం లభించలేదు. దానిపై బిజెపి నిరసన వ్యక్తం చేయడంతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. కోల్ కతా లోని ఆర్ జి కర్ వైద్య కళాశాలలో ఓ జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన నేపథ్యంలో ఈ బిల్లు తెచ్చారు. ఈ నేపధ్యంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను అరెస్టు చేశారు. ఇదివరకే పోలీస్ పౌర వాలంటీర్ సంజయ్ రాయన్ ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News