ఇంఫాల్: ముసాయిదా ఒప్పందం ప్రాతిపదికన కేంద్రంతో శాంతి చర్చలు విజయవంతంగా ముగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న మణిపూర్‌లోని నాగాల ప్రాబల్యం అధికంగా ఉన్న జిల్లాలలో నాగాలు ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఐక్య నాగా మండలి(యుఎన్‌సి) సోమవారం ప్రకటించింది.
తమెంగ్లాంగ్, సేనాపతి, ఉఖ్రుల్, చందెల్ జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఆగస్టు 9న ఉదయం 10 గంటల నుంచి ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు యుఎన్‌సి ఒక ప్రకటనలో తెలిపింది. తుది ఒప్పందంపై సంతకం చేయడంలో జరుగుతున్న జాప్యం ఆందోళన కలిగిస్తోందని, శాంతి చర్చలకు విఘాత ఏర్పడే అవకాశం కనిపిస్తోందని యుఎన్‌సి పేర్కొంది.
ర్యాలీలలో నాగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని యుఎన్‌సి పిలుపునిచ్చింది. 2015 ఆగస్టు 3న కేంద్రం, ఎన్‌ఎస్‌సిఎన్(ఐఎం) మధ్య కుదిరిన ముచారిత్రాత్మక ముసాయిదా ఒప్పందం కారణంగా శాంతి చర్చలలో గణనీయమైన పురోతి ఉందని యుఎన్‌సి పేర్కొంది.