Monday, December 23, 2024

ట్రెజర్ హంట్ నేపథ్యంలో..

- Advertisement -
- Advertisement -

స్పైడర్ మ్యాన్ ఫేమ్ టామ్ హోలెండ్ నటించిన యాక్షన్ మూవీ ‘అన్ ఛార్టెడ్’. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. వీడియో గేమ్ ఆధారంగా అదే టైటిల్‌తో ఈ మూవీని రూపొందించారు. ట్రెజర్ హంట్ నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ స్టూడియోస్ వారు నిర్మించారు. స్పైడర్ మ్యాన్ అభిమానులతో పాటు ఒళ్లుగగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చే చిత్రమిది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, – తమిళ, – కన్నడ, – మలయాళ, – హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఎలాంటి డూప్ లేకుండా హీరో టామ్ హోలెండ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని ఫిల్మ్‌మేకర్స్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News