Thursday, January 23, 2025

రోడ్డు ప్రమాదంలో మేనమామ, కోడలు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : అతి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొని మేనమామ, మేన కోడలు చిన్నారి మృతి చెందిన సంఘటన మంగళవారం సూర్యాపేట జనగాం జాతీయ రహదారిపై కందగట్ల స్టేజి వద్ద చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు నాగారం మ ండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కడారి లింగరాజు (25) తన ఇంటి నుండి తనచెల్లి ఊరైన సూర్యాపేట పట్టణ పరిధిలోని రాయినిగూడెం నుంచి బైక్ పై తన మేనకోడలు పాపరిత్విక(5)ను బైక్ ముందు కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తుండగా కందగట్ల స్టేజి సమీపంలోని మూల మలుపు వద్ద అతివేగంగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సాయిరాం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News