Thursday, January 23, 2025

సింగరేణిలో ఉద్యోగం కోసం మామ మర్డర్

- Advertisement -
- Advertisement -

Uncle murder for Singareni Job

 

జయశంకర్ భూపాలపల్లి: సింగిరేణిలో ఉద్యోగం కోసం మామను మర్డర్ చేసి పోలీస్ స్టేషన్‌లో అల్లుడు లొంగిపోయిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరుశురామ్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సింగరేణిలో వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బండారి ఓదేలు పని చేస్తున్నాడు. ఓదేలుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య నలుగురు కూతుళ్లు, రెండో భార్యకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య రెండేళ్ల కిత్రం హత్య చేయడంతో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇద్దరు కుమారుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని ప్రయత్నిస్తున్నాడు. మొదటి భార్య రెండో కుమార్తె రవళి తన భర్తకు ఆ ఉద్యోగం ఇప్పించాలని తండ్రిపై ఒత్తిడి తీసుకవస్తుంది. పలుమార్లు అడిగినప్పటికి తండ్రి నుంచి సమాధానం రాకపోవడంతో మామపై అల్లుడు కక్షం పెట్టుకున్నాడు. బైక్‌పై వెళ్తున్న మామను పరుశురామ్‌పల్లిలో ట్రాక్టర్‌తో ఢీకొట్టి అల్లుడు హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గతంలో అల్లుడు, మామ మధ్యలో భూతగాదాల గొడవలు ఉన్నట్టు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News