ఢిల్లీ నుంచి దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హబీబ్‌నగర్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : కోడలిపై మామ అత్యాచారం చేసిన సంఘటన నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…దస్తులు కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి నగరానికి మామ(55), కోడలు(21)వచ్చారు. నాంపల్లిలోని ఎన్ఆర్ రెసిడెన్సీ హోటల్లో రూము తీసుకుని ఉన్నారు. బాధితురాలి భర్త తండ్రి, కోడలు కలిసి ఉన్నారు. అర్ధరాత్రి బాధితురాలిపై మామ అత్యాచారం చేశాడు. తెల్లవారిన తర్వాత బాధితురాలు భరోసా కేంద్రంలో ఫిర్యాదు చేయగా వారు హబీబ్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించారు. అక్కడి నుంచి స్టేట్ మెంట్ రాగానే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఇన్స్‌స్పెక్టర్ శివచంద్ర తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.